First slide

Education

Home About Education

మన సమాజంలో విద్య పాత్ర

974 కిలోమీటర్ల పొడవున్న ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువగా వాడబలిజ జనాభా విస్తరించి ఉంది. మిగతా జిల్లాల్లో కూడా వాడబలిజలు తమ ఉనికిని చాటుకుంటున్నారు.

1876లో కళింగపట్నం రేవులో, 1895లో బారువ రేవులో, 1895లో కొత్త పాలెం సమీపంలో, 1899లో కాకినాడ వాకలపూడిలో, 1903లో భీమునిపట్నంలో, 1903లో చింతపల్లి సమీపంలో, 1930లో మచిలీపట్నంలో, 1932లో విశాఖపట్నంలో, 1964లో అంతర్వేదిలో, 1964లో తుని దగ్గర పెంటకోటలో లైటుహౌసు నిర్మాణాలు జరిగాయి.

ఇప్పటి వరకు మన కులంలో రాజ్యాధికారం దిశగా పెద్దగా చైతన్యం లేకపోవడం శోచనీయం. ఫిజిక్స్ ఆచార్యులు, భట్నాగర్ అవార్డు గ్రహీత బర్రిరామచంద్రరావు మన జాతి మొదటి రాజ్యసభ సభ్యులు. వాసుపల్లిగణేష్ కుమార్ మన మొదటి శాసనసభ్యులు.

మన కులంలో ఇంతవరకు ఐఏఎస్, ఐపీఎస్ లు లేకపోవడం బాధాకరం.

మారుతున్న కాలంలో చదువు ఒక్కటే ఏ జాతి నైనా ముందుకు నడిపించేది. జీవితంలో చదువు ఒక భాగమని ఎప్పుడైతే మన జాతి భావిస్తుందో ఆనాడే మనం మరింత ముందుకు వెళ్ళగలమని ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచించాలి. ఆ ప్రణాళిక ఈ రోజునుండే మొదలు పెట్టాలి.

అందరిలో మనముండాలి. మనతో అందరుండాలి. ఇదే మన జాతి ఐక్యతకు ఆలంబన కావాలి.

కార్గో షిఫ్టుల్లో మన యువత కెప్టెన్లుగా, ఫస్ట్, సెకండ్ ఆఫీసర్లు గా, సీమెన్లుగా వేలాదిమంది పనిచేస్తున్నారు. విశాఖపట్నం పోర్టులో ఎక్కువశాతం మంది కార్మికులుగా, సూపర్ వైజర్లుగా, గుమాస్తాలుగా, కళాసీలుగా మనవాళ్ళు పనిచేస్తుండడం అభినందనీయం.

ఇంతవరకు అన్నిరంగాల్లోను మనవాళ్ళు భారతదేశమంతటా, విదేశాల్లో ఉద్యోగరీత్యా ఉన్నా, ఇంకా మనం సాధించాల్సింది ఎంతో ఉంది.

అందరూ బాగా చదువుకోవాలి. ఈ పోటీ ప్రపంచంలో మనవాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆరెస్, ఐ ఎఫ్ ఎస్ లుగా తయారు కావాలి. ఆ ప్రణాళిక మీ మనసుల్లో రచించుకోండి.

రచయిత

చొక్కర తాతారావు

సైంటిఫిక్ ఆఫీసర్ (R)3

కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ (ICAR)

The Role Of Education In Our Community

The 974 km long coastal region of Andhra Pradesh is especially populated by the Vadabalija population in Srikakulam, Vijayanagaram, Visakhapatnam and East Godavari districts. Vadabalijas are also making their presence felt in other districts.

In 1876 at Kalingapatnam harbor, in 1895 at Barua harbor, in 1895 near New Palace, in 1899 at Kakinada Vakalapudi, in 1903 at Bhimunipatnam, in 1903 near Chintapalli, in 1930 at Machilipatnam, in 1932 at Visakhapatnam, in 1964 at Antarvedi and in 1964 at Tuni near Pentacota.

It is unfortunate that so far our caste has not had a great deal of consciousness towards statehood. Professor of Physics, Bhatnagar Award recipient Barriramachandra Rao was the first Rajya Sabha member of our nation. Vasupalliganesh Kumar was our first legislator.

It is sad that our caste does not have IAS and IPS so far.

Education is the only thing that can drive any race forward in the changing times. Everyone should think in that direction so that we can go further whenever our race feels that education is a part of life. That plan should start today.

We must be in everyone. Everyone should be with us. This is what we need to support our racial unity.

Thousands of our youth are working as captains, first and second officers and seamen in cargo shifts.

It is commendable that most of the grandchildren work in the Visakhapatnam port as laborers, supervisors, clerks and college students.

So far our grandchildren in all fields are employed all over India and abroad, but we still have a lot to achieve.

Everyone should study well. In this competitive world grandchildren should be made IAS, IPS, IRS, IFS. Write that plan in your mind.

Author

Chokkara Tatarao

Scientific Officer(R)3

central Marine Fisheries Research Institute(ICAR)

© Vadabalija Community - 2021. All rights reserved. | Terms & Conditions

About | History | Members