Email Us
భారతదేశంలో ఆగ్నేయ తీరప్రాంతంలోని ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
ఆంధ్రులు ఉత్తర భారతదేశంలోని యమునా నది ఒడ్డునుండి దక్షిణ భారత దేశానికి వలస వచ్చినట్టుగా చరిత్ర చెబుతోంది. ఆంధ్ర దేశానికి, భారత దేశానికి తొలి రాజులైన ఆంధ్రులు అని పిలువబడిన శాతవాహనులు పాలించడం వలన ఈ ప్రాంతానికి ఆంధ్ర దేశం అని పేరు వచ్చింది.
పల్లవ వంశీయులు ఆంధ్ర దేశంలో రాజ్యాన్ని చేయక ముందు నుంచే బలిజలు(బలిజ వంశీయులు) నౌకా వాణిజ్యం, నావికా వృత్తిని అవలంభించినట్టు చరిత్ర చెబుతోంది.
శాతవాహన చక్రవర్తులు, అశోక్ చక్రవర్తి పరిపాలన కాలంలో ఆంధ్రదేశం నుండి విదేశాలలో వర్తకం చేయుటకు, బౌద్ధమత ప్రచారం చేయుటకు బలిజలే మొదట్లో సముద్రయానం చేసారు.
భారతదేశ తీరం వెంట ఉన్న ప్రాంతాలలోను, గ్రీసు రోమువంటి దూర దేశాలలోను, బర్మా, నయాం, చైనా, తూర్పు సముద్ర దీవులలోను ఆంధ్రులు నౌకా వ్యాపారం సాగించేవారు.
కృష్ణానది ముఖద్వారం ఖండాంతర వాణిజ్యంనకు కేంద్రంగా ఉండేది. ఆంధ్రదేశపు తీరాన ఘంటసాల,కోరంగి, గూడూరు రేవులు ముఖ్య నౌకాస్థానాలుగా, వ్యాపారం కేంద్రాలుగా ఉండేవి.
కళింగ దేశమును గంగవంశం రాజులు ఎక్కువ కాలం పాలించారు. వంశధార నది ఒడ్డున ఉన్న శ్రీముఖలింగ క్షేత్రం కళింగ నగరంగా గుర్తించబడింది. ఇక్కడనుండి నౌకా వాణిజ్యం ఎక్కువగా జరిగింది. కళింగాంధ్రులు మహా సాహసికులైన నావికులు గా ఉండేవారు.
వీరు వందలాది ఓడల్లో బర్మా, నయాం, కాంబోడియా,మలయా ద్వీపకల్పం, జావా, సుమిత్రా దీవులు మొదలైన దేశాలకు వర్తకం నిమిత్తం వెళ్ళేవారు.
గంగరాజులు శ్రీకూర్మం ముఖలింగం, పూరీ జగన్నాథ ఆలయం, కోనార్కలోని సూర్య దేవాలయం నిర్మించారు. భాగవతం, విష్ణుపురాణం, బ్రహ్మాండ పురాణాల్లో బలిజలు చంద్ర వంశం క్షత్రియులని పేర్కొనడం జరిగింది.
కాకతీయ రాజులు,నాయక రాజులు, రెడ్డి రాజులు, విజయనగర రాజుల కాలం నాటికి బలిజలు వివిధ రకాలైన వర్తకులుగా ఉన్నారు. వ్యాపారాలు చేయడం వలన రాజకుటుంబాలతో సత్సంబంధాలు ఏర్పరచుకుని అక్కడక్కడా గ్రామాధిపత్యం కూడా బలిజలకు సంక్రమించిందని చరిత్ర వలన తెలుస్తోంది .
క్రీస్తు పూర్వం 5 - 6 శతాబ్దం నాటికి విదేశాల్లో నౌకా వాణిజ్యం, స్వదేశాల్లో వివిధ వ్యాపారాల్లో బలిజలు అనుభవశాలురని, శ్రేష్ఠులని పేరుంది. ఈ విధంగా వీరి పేరు చివర శ్రేష్టి, శెట్టి అను బిరుదులుండేవి.
ఈ విధంగా వాడబలిజ కులంలో శెట్టి, చెట్టి ఇంటిపేర్లుగా మారి ఉండవచ్చునని ఒక అంచనా
అంతవరకు బలిజ వంశస్థులు అందరూ ఐక్యంగా ఉండి, తదనంతర కాలంలో వృత్తులను బట్టి కులాలుగా విడిపోయారు.
ఓడలలో వ్యాపారాలు చేయడం వలన, నావికులు గా పనిచేయడం వలన బలిజలు ఓడబలిజలుగా రూపాంతరం చెందారు. అప్పటి నుంచే ఓడబలిజ ఒక కులంగా వ్యాప్తిలోకి వచ్చింది. కాలక్రమంలో ఓడబలిజ, 'వాడబలిజ'గా ప్రభుత్వ రికార్డులలో గుర్తింపు పొందింది.
ఓడలపై విదేశీ వర్తకం చేయు బలిజలు కొందరు ప్రత్యేకంగా రత్నాలు వ్యాపారం చేయడం వలన వీరికి రత్న బలిజలు అని పేరు రావడం జరిగింది. వాడబలిజ కులంలో కొంతమంది సంపన్నులు రత్న బలిజలుగా చెలామణి అవుతున్నా, కులపరంగా రత్నబలిజకు ప్రభుత్వ గుర్తింపు లేనందున రత్నబలిజ పేరు నామమాత్రంగా మిగిలిపోయింది.
బలిజలు వివిధ వృత్తి వ్యాపారాలు చేయడం వలన పగడాలబలిజ, పెరికెబలిజ, గాజులబలిజ, తోటబలిజ, రాళ్ళబలిజ, గండవరబలిజ, గోనుగుంట్ల బలిజ, పూలబలిజ, పూసలబలిజ, సెవ్వాకులబలిజ, కుంకుమబలిజ, ఉప్పుబలిజ, ఆకులబలిజ, పిట్టబలిజలుగా వీరు ఒడిశా గంజాం జిల్లాతోపాటు ఆంధ్రరాష్ట్రమంతటా వ్యాపించిఉన్నారు.
కాకినాడకు చెందిన చొక్కాచిన్నయ్య నాయుడు, పిరాదిసత్తిరాజునాయుడు, డొంకగోవిందరాజునాయుడు, మేరువు పరుశురామునాయుడు, రాసంశెట్టివారికి, గంధావారికి, తోలాడివారికి తెరచాప ఓడలు(వర్తకపు ఓడలు) ఉండేవి. కృష్ణా, విశాఖపట్నం, శ్రీకాకుళం,గంజాం జిల్లాల్లో ఉన్న వాడబలిజ వర్తకులకు సొంతంగా తెరచాప ఓడలు లేవు.
కాకినాడ జగన్నాథపురానికి చెందిన గరికినసత్తిరాజునాయుడు,పుక్కెళ్ళ సత్యనారాయణ నాయుడు,సోడిపల్లి మసేనునాయుడు, డొంకవెంకటరాజు అండ్ బ్రదర్స్, కె.అమ్మోరు మొదలగు వారికి కార్గో బోట్లు ఉండేవి.
ఆర్ధికంగా స్థిరపడిన వాళ్ళలో ఎక్కువమంది ఆరోజుల్లోనే తమ పేరు చివర నాయుడు అని రాసుకొనే వాళ్ళు. ఆ పరంపర ఇప్పటికీ కొందరిలో కొనసాగుతూనే ఉంది.
మోటుపల్లి, ఘంటసాల, గూడూరు, కోరంగి, తాళ్ళరేవు, ఓడలరేవు మొదలైన రేవుప్రాంతాల్లో నౌకా నిర్మాణాలు జరుగుతుండేవి.
ఇక్కడినుండి నౌకా వ్యాపారం, నావికా వృత్తిని ఆధారంగా చేసుకుని గోదావరి నది మొదలుకొని సముద్రం పొడవునా సుమారు 500 మైళ్ళు వరకు అనగా ఉత్కళ రాష్ట్రాన ఉన్న మహానది వరకు వాడబలిజ జనం వలసపోయి, తీరప్రాంతమున ఉన్న పట్టణాల్లో, గ్రామాల్లో స్థిరనివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నారు.
1952లో కాకినాడలో ఉన్న వాడబలిజ తదితర కార్గో బోట్లు యజమానులు 'The Andhra Marine Boat Union' సంఘం స్థాపించారు.
సోంపేట, బారువ, మెట్టూరు, గుణుపల్లి, అక్కుపల్లి, బైపల్లి, శ్రీకాకుళం, కళింగపట్నం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఉప్పాడ మొదలైన ప్రాంతాల్లో వాడబలిజ
సంఘాలు స్థాపించి, ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
అంబటి, అమర, అయింది, ఆకులు, అర్జాల, అర్జిల్ల, అర్జిల్లి, అల్లేపల్లి, అల్లిపిల్లి, ఆవుల,ఆరది, అనుపిల్లి, అంగ, అత్తిలి, అరికిన. |
ఇద్ది, ఇప్పిలి, ఇప్పలి. |
ఉమ్మిడి, ఉప్పాడ, ఉలిమిరి, ఉప్పరపల్లి, ఉడుకళ్ళ. |
ఎరుపల్లి, ఎరిపిల్లి. |
ఓరుగంటి. |
కుంపట్ల, కర్రి, కోన, కొండ, కోమల, కంబాల, కొండప్ప, కన్న, కాస, కుందు, కుంది, కోడ, కోనాడ, కారె, కారి, కొవిరి, కాయ, కుందా, కూర్మదాసుి. |
గంగిరి, గంగిది, గుంటు, గుంటి, గుర్రాల, గంతి, గోపిల్లి, గంట, గద్దిపల్లి, గంధ, గంధం, గండుపల్లి, గోన, గూన, గనగళ్ళ, గంపల, |
చొక్కా, చొక్కర, చల్లపల్లి, చిడమాన, చింతపల్లి, చాపర, చీగటి, చీపుళ్ళ, చింతకాయల, చెల్లూరి, చెంబూరి, చెట్టి, చల్లపల్లి, చెల్లపల్లి, చేపలు, చవాకుల, చోడిపల్లి, చిడమాన, చెన్నా, చిడుపల్లి, చిడమాడ, చిచ్చల. |
జోగి, జోలింగి. |
డొక్కాడి. |
తోలాన, తయ్య, తోలాడ, తోలాడి, తిక్కాడ, తెప్పల, తిమ్మ, తిర్రి, తిత్తి, తిరుమల. |
దుమ్ము, దార, దౌలపల్లి, దౌరుపిల్లి, దేవరపల్లి, దాసరి, దూడ, దెయ్యాల. |
నంద, నీలకంఠ, నయనప్పగారి, నానె, నామాల, నక్క, నరవ, నీలపల్లి. |
పల్లేటి, పొట్టి, పుక్కళ్ళ, పుక్కెళ్ళ, పిరాది, పప్పు, పసుపులేటి, పెమ్మిడి, పెరుమళ్ళ, పువ్వుల, పరిమెళ్ళ, పరిమెల, పల్లేటి, పాకల, పొన్నాడ, పారా, పీరుపల్లి, పేర్ల, ప్రగడ, పారుపూడి. |
బైపల్లి, బొంది, బొందు, బొందిలి, బడే, బుల్లి, బాతుల, బొడ్డు, బెహరా, బుడ్డా, బుక్కల, బుద్ధ, బొంపల్లి, బారువ, బొంగపల్లి. |
మొరిపల్లి, మైలపల్లి, మూగి, మోస, మీలపల్లి, మేరుగు, మేరువు, మడ్డు, ముత్తు, ముత్తి, మూతారప మరద, మడద, మంజునాధ, మేడ, మాదాడ, మోయి, మల్లి, మంద, మల్ల, మేక, మణి. |
యంపల్ల, యజ్జల. |
రిక్క, రట్టి, రాపాక, రాగతి, రాయితి. |
లండ, లంక. |
వాసుపల్లి, వంక, వారాది, వరదా, వరిపల్లి. |
శ్రీరామ, శీరం, శివకోటి. |
సూరాడ, సాతుపల్లి, సురపతి, సీకోటి, సీరం, సుంకర, సదాశివ, సిద్ధా, సండుపల్లి, సుకల. |
హరి. |
చొక్కర తాతారావు
సైంటిఫిక్ ఆఫీసర్ (R)3
కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ (ICAR)
Andhra Pradesh is a state on the southeastern coast of India.
History tells us that the Andhrites migrated to southern India from the banks of the Yamuna River in northern India. The region got its name from the Satavahanas, the so-called Andhrites, the first kings of Andhra Pradesh and India.
History tells us that the Balijas (Balija dynasty) adopted the naval trade and naval occupation long before the Pallavas ruled Andhra Pradesh. During the reign of the Satavahana emperors, Emperor Ashok, Balijale first sailed from Andhra Pradesh to trade abroad and propagate Buddhism.
Andhrites traded along the coast of India, in distant lands such as Greece and Rome, as well as in Burma, Naym, China, and the East Sea islands.
The mouth of the Krishna River was the center of intercontinental trade. The ports of Ghansala, Korangi and Gudur on the coast of Andhra Pradesh were important ports and trading centers.
The country of Kalinga was ruled for a long time by the kings of the Ganga dynasty. Srimukhalinga Temple, located on the banks of the Vansadhara River, is known as the city of Kalinga. From here much of the shipping trade took place. The Kalingandhras were great adventurers.
Hundreds of ships sailed to Burma, Nayam, Cambodia, the Malay Peninsula, Java, and the Sumitra Islands.
The Gangarajas built the Srikuram Mukhalingam, the Puri Jagannath Temple and the Sun Temple in Konark.
In the Bhagavatam, Vishnu Purana and Brahmanda Puranas, the Balijas are said to be Kshatriyas of the Chandra dynasty.
By the time of the Kakatiya kings, Nayaka kings, Reddy kings and Vijayanagara kings, the Balijas were a variety of traders. History has shown that doing business established good relations with the royal family and in some cases the village administration also passed on to the victims.
By the 5th - 6th century BC, the marine trade abroad, the Balijas experienced and distinguished in various trades at home. Thus at the end of their names were the titles of Shrestha and Shetty.
Thus it is speculated that Shetty and Chetti may have become surnames in the Vadabalija caste Until then the Balija dynasty was all united and subsequently divided into castes according to occupations.
By doing business on ships and working as sailors, the Balijas were transformed into ships. Since then the Odabalija have spread into a caste. Over time, Odabalija became known in government records as 'Vadabalija'.
Some of the victims who traded on ships were specially traded in gems, hence the name gem victims. Although some of the wealthy members of the Vadabalija caste were circulating as Ratna Balija, the name Ratnabalija remained nominal as there was no government recognition for Ratnabalija by caste.
Due to the fact that the victims do various professional trades, they are known as Pagadalabalija, Perikebalija, Gajulabalija, Thotabalija, Rallabalija, Gandavarabalija, Gonuguntla Balija, Poolabalija, Pusalabalija, Sevakulabalija, Kunkumabalija, Uppubalija and Akulabalija.
Chokkachinnayya Naidu, Piradisathirajunayudu, Donkagovindarajunayudu, Meruvu Parushuramunayudu, Rasamsetti, Gandhavariki and Toladivari of Kakinada had sailing ships (merchant ships). Vadabalija traders in Krishna, Visakhapatnam, Srikakulam and Ganjam districts do not have their own sailing vessels.
Garikinasathirajunayudu, Pukkella Satyanarayana Nayudu, Sodipalli Masenunayudu, Donkavenkataraju and Brothers, K. Ammoru and others from Kakinada Jagannathapura had cargo boats.
Most of the financially settled people are the ones who write their name as Naidu at the end of the day. That series is still going on in some.
Shipbuilding took place at Motupalli, Ghantasala, Gudur, Korangi, Thallarevu, Odalarevu and other port areas.
From here, based on their shipping and naval occupations, the Vadabalija people migrated from the Godavari River to the sea up to about 500 miles across the sea, i.e. to the Mahanadi in the state of Utkal, and settled in coastal towns and villages.
The Andhra Marine Boat Union was formed in 1952 by the owners of Vadabalija and other cargo boats in Kakinada.
Vadabalija societies have been established in Sompeta, Barua, Mettur, Gunupalli, Akkupalli, Baipalli, Srikakulam, Kalingapatnam, Vijayanagaram, Visakhapatnam, Kakinada, Uppada etc. to serve the people.
Ambati, Amara, Aindi, Leaves, Arjala, Arjilla, Arjilli, Allepally, Allipilli, Cows, aradi, anupilli, anga, attili, arikina. |
Iddi, Ippili, Ippali. |
Ummidi, Uppada, Ulimiri, Upparapalli, Udukalla. |
Erupalli, Eripilli. |
Oruganti. |
Kumpatla, Karri, Kona, Konda, Komala, Kambala, Kondappa, Kanna, Kasa, Kundu, Kundi, Koda, Konada, Kare, Kari, Koviri, Kaya, Kunda, Kurmadasu. |
Gangiri, Gangidi, Guntu, Gunti, Gurrala, Ganti, Gopilli, Ganta, Gaddipalli, Gandha, Gandham, Gandupalli, Gona, Goona, Ganagalla, Gampala, |
Chokka, Chokkara, Challapalli, Chidamana, Chintapalli, Chapara, Chigati, Cheepulla, Chintakayala, Chelluri, Chemburi, Chetti, Challapalli, Chellapalli, Chepalu, Chavakula, Chodipalli, Chidamana, Chenna, Chidupalli, Chidamada, Chichala. |
Jogi, Jolingi. |
Dokkadi. |
Tolana, Tayya, Tolada, Toladi, Thikkada, Theppala, Thimma, Tirri, Titti, Thirumala. |
Dust, Dara, Daulapalli, Daurapilli, Devarapalli, Dasari, Duda, Deyala. |
Nanda, Nilakantha, Nayanappagari, Nane, Namala, Nakka, Narava, Neelapalli |
Palleti, Potti, Pukkalla, Pukkella, Piradi, Pappu, Pasupuleti, Pemmidi, Perumalla, Puvula, Parimella, Parimela, Palleti, Pakala, Ponnada, Para, Peerupalli, Perla, Pragada, Parupudi. |
Baipalli, Bondi, Bondu, Bondili, Bade, Bulli, Batula, Boddu, Behera, Buddha, Bukkala, Buddha, Bompalli, Barua, Bongapalli. |
Moripalli, Mylapalli, Moogi, Mosa, Milapalli, Merugu, Meruvu, Maddu, Muthu, Mutti, Mutarapa Marada, Madada, Manjunatha, Meda, Madada, Moi, Malli, Manda, Malla, Meka, Mani. |
Yampalla, Yajjala. |
Ricka, Ratti, Rapaka, Ragati, Raiti. |
Landa, Lanka. |
Vasupalli, Vanka, Varadi, Varada, Varipalli. |
Srirama, Seeram, Sivakoti |
Surada, Satupalli, Surapati, Sikoti, Seeram, Sunkara, Sadasiva, Siddha, Sandupalli, Sukala. |
Hari. |
Chokkara Tatarao
Scientific Officer(R)3
central Marine Fisheries Research Institute(ICAR)
© Vadabalija Community - 2021. All rights reserved. | Terms & Conditions